ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

గరుడ పురాణం పుణ్య విశేషాలు

🙏🌺 🌺🙏


🌺అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణ మొకటి.🌺

🌺ఒక్క మానవులకే కాకుండా సకల జీవారాశులకి పునర్జన్మ ఉందని గరుడపురాణం చెప్తుంది.

మన ప్రాచీన వాజ్ఞ్మయం పంచిచ్చిన వేదవేదాంగాలు., రామాయణ., మహాభారత ఇతిహాసాలు., అష్టాదశ పురాణాలు., అన్నీకూడా మన ప్రాచీన సనాతన హిందూధర్మ ఆచరణ విధానాలను, విశిష్టతలను చాటిచెప్తాయి.

గరుడపురాణంలో మానవుడుచేసే దానధర్మాల వల్ల., సత్కర్మలవల్ల., మరణానంతరం ఊర్ధ్వలోకాల్లో ఎటువంటి స్థితిసంప్రాప్తిస్తుందో తెలియజేస్తుంది.

ఇహలోకంలో గోదానం చేసినందువల్ల గోలోకంలో చోటు లభిస్తుంది.

గోవు యీనేసమయంలో ఆ గోవుని., దూడని దానంచేసినవారికి తప్పక వైకుంఠవాసం లభిస్తుంది.

అన్నదానం చేసినవారు, తామిష్టపడిన లోకంలో సుఖంగా వుంటారు. 🌺

🌺ఛత్ర (గొడుగు) దానంచేసినవారు 1000 సంవత్సరాలు వరుణలోకంలో సుఖాలనుభవిస్తారు.

రాగి., నెయ్యి., మంచం., పక్కలు., చాప., దిండు మొదలైనవాటిలో ఏది దానంచేసినా సత్యలోకంలో సుఖాలనుభవిస్తారు.

వస్త్ర దానం చేసినవారు వాయు లోకంలో 10000 సంవత్సరాలు జీవిస్తారు.

రక్తం., కళ్ళు., అవయవాలు దానం చేసినవారు అగ్నిలోకంలో ఆనందంగా వుంటారు.

ధాన్యం., నవరత్నాలను దానం చేసినవారు మరు జన్మలో మేధావిగాను., దీర్ఘాయువు కలిగివుంటారు.

సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెళతారు.

ఒక కన్యకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమంగా పెంచి వివాహం చేసినవారికి 14 మంది ఇంద్రుల ఆయువుకాలం స్వర్గలోకఅమరావతిలో నివాసం లభిస్తుంది.

బంగారం., వెండి ఆభరణాలు దానంచేసినవారికి కుబేరలోకంలో ఒక మన్వంతరం నివాసంలభిస్తుంది.

ధనసహాయం చేసినవారికి శ్వేత దీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుంది.

సకల జీవులకుపయోగపడే వృక్షాలు నాటి పెంచినవారు తపోలోకానికి వెడతారు. 🌺

🌺ఆలయాల నిర్మాణానికి దానం చేసేవారు 64 సంవత్సరాలు పరమపదంలో వుంటారు.

దేవుని ఊరేగింపులు జరిపే వీధుల న్నింటినీ శుభ్రపరిచేవారు 10000 సంవత్సరాలు ఇంద్రలోకంలో సుఖిస్తారు.

పౌర్ణమినాడు ఊయల ఉత్సవసేవ చేసేవారు భూలోకంలోను పరలోకం లోను సుఖాలనుభవిస్తారు.

రుచిగల ఫలాలను దానంచేసేవారు ఒకపండుకి ఒకసంవత్సరం చొప్పున గంధర్వలోకంలో నివసిస్తారు.

ఒక చెంబు మంచినీటిని ఒక మంచిమనిషికి దానంచేసినవారికి కైలాసప్రాప్తి లభిస్తుంది.

అరుణోదయాన గంగలో స్నానం చేసినవారికి 60000 సంవత్సరాలు పరమపదంలో వుంటారు.

వ్రతాలు, నోములు భక్తితో ఆచరించే వారు 14 ఇంద్ర, ఆయువు కాలాలు స్వర్గంలో నివసిస్తారు.

సుదర్శనహోమం., ధన్వంతరిహోమం చేసేవారు ఆరోగ్యం కలిగి శత్రువులు లేకుండా దీర్ఘాయువుతో వుంటారు.

గరుడపురాణం చదివేవారు., వినేవారు పుణ్య కాలాల్లో దానమిచ్చేవారు తమ అంతిమకాలంలో మంచిలోకాలను చేరుకుని సుఖిస్తారు. వారి తల్లి తండ్రులు., పితామహులు ముక్తిపొందుతారు.

ఈ విధంగా గరుడపురాణం మానవుడు చేయదగిన మంచి కార్యాల గురించి బోధిస్తుంది. 🌺

One response to “గరుడ పురాణం పుణ్య విశేషాలు”

  1. Narasimhaachari Avatar
    Narasimhaachari

    poojamandiram lo chanipoina vari photo pettukovacha

    మెచ్చుకోండి

Leave a reply to Narasimhaachari స్పందనను రద్దుచేయి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి