ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

నాగులను ఎందుకు పూజించాలి

నాగులను_ఎందుకు_పూజించాలి???

నాగుల చవితి, నాగ పంచమి ఆధ్యాత్మిక వివరణ:
నాగులు విష జీవులు. అలాంటిది సనాతన ధర్మంలో వాటిని ఎందుకు పూజిస్తారు?
సర్పాలు కుండలీని శక్తికి సంకేతం. అందుకే, మన దేవతలు నాగులని ఆభరణములుగా ధరిస్తారు. శ్రీమహా విష్ణువు ఆది శేషుడి మీద పవళిస్తాడు. వినాయకుడు సర్పముని వడ్డాణంగా మరియు యజ్ఞోపవీతంగా అలంకరిస్తాడు. మహా శివుని శరీరం అంతా పాములతో నిండి ఉంటుంది. సుబ్రహ్మణ్యం స్వామిని నాగ స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారికి కుండలీని శక్తి సర్ప స్వరూపంలో ఉంది.
సర్పానికి శత్రువులు గరుక్మంతుడు (గ్రద్ద), నెమలి, ముంగిస. శ్రీమహా విష్ణువు వాహనం గరుక్మంతుడు. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. అమ్మవారిని ‘నకులేశ్వరి’ అని పిలుస్తారు. ‘నకుల’ అంటే ‘ముంగిస’ స్వరూపమైన దేవి.
మనిషిలోని కుండలిని శక్తి సర్ప రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ కుండలినీ శక్తి సర్పాలు రెండు రకాలు. ఒకటి మనిషిని పాడు చేసే సర్పం. ఒక సర్పం మనిషిని ఉద్దరణలోకి తీసుకుని వెళ్ళే సర్పం.
మనిషిలోని తేజస్సుని కేవలం ఇంద్రియ లౌల్యం కొరకు పోగొట్టుకునే వాళ్ళు బ్రహ్మం నందు నిలబడలేరు. అటువంటి వారిలోని సర్పం కుండలీనిలో పడుకుని ఉంటుంది. అది తేజస్సుని క్షయం చేస్తుంది. అది వారి తేజస్సుని పైకి తీసుకుని వెళ్ళకుండా, అధో ముఖంగా కిందకు వెళ్ళేటట్లు చేస్తుంది.
రెండవ రకమైన సర్పం మనిషికి ఉద్దరణ కలిపించగలిగేది ఉండి, అతనిని బ్రహ్మం నందు నిలబడేటట్లు చేస్తుంది. అలాంటి వ్యక్తి తన తేజస్సుని ఓజస్సుగా మార్చుకోగలుగుతాడు.
ఏ మనిషి అయితే ఇంద్రియ సుఖానికి లొంగిపోతూ ఉంటాడో, అతను భగవతారాధన చేత మళ్ళీ తన తేజస్సుని జన్మ ప్రయోజనానికి (మోక్ష) కావల్సిన స్థితికి వినియోగించగలుగుతాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి నెమలి, శ్రీ మహా విష్ణువు వారి గరుక్మంతుడు, అమ్మవారు నకులేశ్వరిగా మనిషిని అధోగతికి తీసుకుని వెళ్ళే సర్పాన్ని వధించి, అతినిని ఉద్దరించే సర్పాన్ని ఊర్ధ్వ ముఖంగా పైకి తీసుకుని వెళ్ళే శక్తిని ప్రసాదిస్తుంది. This is called kundalini awakening.
సంసారాగ్రస్తుడైన జీవుడిని సంసార జీవనం నుండి విడుదల చేసి, ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకే దీనికి గుర్తుగా ప్రతి ఏటా మనం నాగుల పంచమి రోజు, నాగుల చవితి నాడు దేవతలని ప్రాద్ధిస్తాము.
అంతేకాక, పురుష వీర్య కణాలు సర్ప రూపంలో తిరుగుతాయి, అందుకే సంతానం పొందాలని కోరుకునే వారు, తనలోని తేజస్సుని పెంచి తనకి సంతానం ఇవ్వమని ఈ రోజు సర్పాన్ని పూజిస్తారు.

🚩సర్వే జనాః సుఖినోభవంతు 🚩

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి