1. సాధకుడు జపం ద్వారా ఇష్ట ఫలితాన్ని పొందడం కోసం సంపూర్ణ ప్రయత్నం చేయాలి. ఏ విషయం లోపించిందో చూసి దానిని సరిచేసుకోవాలి. మంత్రాన్ని త్వరగా ఉచ్చరించడం వలన మంత్ర హీనత కలిగితే తడబాటు పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరించడం అలవాటు చేసుకోవాలి. మంత్ర జపం కోసం భక్తి శ్రద్ధలను పెంచుకోవాలి.
2. కొన్ని మంత్రాలు కిలితాలు ఉంటాయి. అలాంటి మంత్రాలను ఉత్కీలనము చేసి గానీ ఆ మంత్రం చైతన్యం పొందవు. ఏ మంత్రం అయినా సిద్ధించాలంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి.
3. మంత్ర జపం అనేది ఏదో యాంత్రికంగా చేసే ప్రక్రియ కాదు. ఇందులో దైహిక మానసిక తత్త్వాలతో పాటు చేతనత్వాన్ని కూడా సంయోజనం చేయాలి. మంత్ర మూర్తి చైతన్యమును పొందటానికి అష్టాంగ యోగాన్ని అంటే ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహరం,ధారణ, ధ్యానం, యమ, నియమాలు , వంటివి విధిగా పాటించాలి. ఇవి కఠినమైన నియమాలుగా భావించకుండా జీవన విధానం గా భావించాలి. అప్పుడే సాధన లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. కుండలినీ యోగాన్ని నేర్చుకొని సాధన చేయాలి. అప్పుడు మంత్రం అతి త్వరగా చైతన్యాన్ని పొంది అమోఘమైన ఫలితం ఇస్తుంది. సాధారణ కామ్య కర్మలకు మామూలు పూజా, జపాలు చిన్న పాటి వ్రతాలు చేస్తె సరిపోతుంది.
3. సాధకుని మీద పూర్వ జన్మలలో ఏర్పడి ఉన్న అనేక మల నిక్షేపాలు పని చేస్తూ ఉంటాయి. బాహ్యాభ్యంతర శౌచాలను తొలగించుకోవడం కోసం స్నానం , మార్జనం మంత్ర విధిగా చేసి అంతరంగంలో సత్వ్తశుద్ది ఏర్పాటు చేసుకోవాలి. అంటే బాహ్య శుద్ది ఎంత అవసరమో అంతకంటే అంతర శుద్ది చాలా ముఖ్యం. పూర్తిగా అంతఃశుద్దిని సాధిస్తే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. మలము అంటే మనిషి స్వయంగా ఆర్జించుకున్న దోషం దాని వలన మనసు దోషయుక్తంగా ప్రవర్తిస్తుంది. ఇవి కాకుండా గురు శాఫం, మాతృ శాపం, దేవతా శాపం కూడా సాధకుడిని పీడిస్తూ ఉంటాయి. వీటి అన్నింటి వలన వ్యక్తి విడతీసుకోలేని బంధాలతో పడిపోతాడు. పాప ప్రక్షాళన కోసం ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఉపవాసం ఉండటం, వైరాగ్యం, సమత్వ బుద్ది , భగవంతుని సంపూర్ణ శరణాగతి మొదలైనవి చాలా వరకు ఈ బంధనాల నుంచి మలనిర్మూలనకు సరైన మార్గం. ఇష్ట దేవత పట్ల సంపూర్ణ శరణాగతి పొంది మంత్ర జపం చేసిన మంత్ర సిద్ధి త్వరగా కలుగుతుంది. సాధకులు పరిహసము, పాప చింతన అంటే నెగెటివ్ ఆలోచనలు విడిచి పెట్టాలి .
5. రెండు విరోధ మంత్రాలను ఒకే సారి జపం చెయ్యకూడదు. విరోధి మంత్రాలు జపం చేస్తూ ఉంటే ఋణాలు సమానమై ఫలితం శూన్యం ఉంటుంది. పరస్పర సహకార మంత్రాలను మాత్రమే ఒకే సారి జపం చేయవచ్చు. ఆంజనేయ మంత్రాలకు రామ మంత్రాలు, గణపతి కార్తికేయ మంత్రాలతో దేవి మంత్రాలు, గ్రహ మంత్రాలతో వాటి ఆది దేవత ప్రత్యది దేవతా మంత్రాలు సహకారంగా ఉంటాయి. మంత్రాలకు పరస్పర విరోధ బీజాక్షరాలను సంపుటీకరణ కూడా ఫలితం నష్టం అవుతుంది. సౌమ్య కర్మ ప్రయోగాలతో పాటు ఉగ్ర కర్మ ప్రయోగం కూడా ఒకే సారి చేస్తే ప్రయోజనం ఉండదు. బైరవ మంత్రాలతో దుర్గా , గాయత్రి మంత్రాలను జపం చేయవచ్చు. విష్ణు మంత్రాలను బైరవ మంత్రాలను ఒకే సారి జపం చేస్తే ఫలితం ఉండదు అంటారు. కాబట్టి రెండు మంత్రాలను ఒకే సారి సాదించేద్దాం అని చేయకూడదు.
6. మంత్ర ఉచ్చారణలో ఏమైనా తప్పులు చదువుతున్నా ! తడబడుతున్న అక్షరాలను మధ్యలో వదిలేసి చదువుతున్నా మంత్ర ఉచ్ఛారణ దోషం కలిగింది అని గమనించండి. ఉచ్చారణ సరిగా లేకపోవడం వలన ఎంత జపం చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. ముందుగా ఓంకారం జపం చేయడం అలవాటు చేసుకోవాలి. దాని వలన మంత్రాన్ని స్వర యుక్తంగా జపం చేయడం వస్తుంది.
7. మంత్ర ఉచ్చారణలో బీజాంశాలు, వర్ణాంశములను విడిచి పెట్టడం వలన మంత్ర హీనత అనే దోషం కలుగుతుంది. మంత్ర జపం లో సగం సగం అక్షరాలను పలకరాదు. ఉచ్చారణలో మంత్ర దోషాలు అనేవి తొందర పాటు వలన, మానసిక ఉద్విగ్నత, బలమైన విశ్వాసం లేకపోవడం, అనారోగ్యం, తర్క ప్రవృత్తి, బాషా జ్ఞానం లేకపోవడం, అలసత్వం, మొదలైన వాటి వలన కలుగుతుంది. కాబట్టి ఇలాంటి బలహీనతలను సాధకుడిలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
8. జపానికి ముందు చేసే అర్చన, పూజ, మొదలైనవి మంత్ర హీనంగా చేసినా మంత్ర సిద్ధి ఉండదు.
9. మంత్ర ప్రయోగము, గ్రహ బాధలు, రోగాలను తొలగించుకోవడం కోసం రక్షా కవచాలను కూడా పఠించడం అవసరం ఉంది. ఏ మంత్రాన్ని జపిస్తూ ఉన్న ఆ దేవత యొక్క కవచం, హృదయం, స్తోత్రం పఠించాలి. దేవతలకు మంత్రం, కవచం, స్తోత్రములను భగవంతుడు ఇచ్చాడని బ్రహ వైవర్త పురాణం లో ఉంది. కవచాన్ని రాగి రేకు పై వ్రాసి పూజించాలి. దానిని కఠం వద్ద గానీ, భుజం వద్ద గానీ, రక్షణ కోసం కార్య సిద్ధి కోసం ధరించాలి.
10. ఏదైనా ప్రత్యేక కామ్య కర్మల యందు జపాన్ని కామ్య ప్రయోగం లో ఉపయోగించే సమయం లో జపాన్ని విధిగా పూర్తి చేసి పూజ, హోమం, అన్న దానం, ఇతరా దానాలు, తర్పణాలు చేయాలి.
11. కామ్య ప్రయోగాలలో కూడా భక్తి శ్రద్ధలు లేని జపం వలన మంత్రానికి ప్రాణం ఉత్పత్తి అవదు. ఆసనం, దిశ, ముద్రలు, ప్రసాదములు, పుష్పాలు, దానికి తగిన ద్రవ్యాలు, ఆయా మంత్ర దేవతలకు తగిన విధంగా ఉండాలి.
వ్యాఖ్యానించండి