ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

భైరవ రహస్యం



భైరవుడు లేక హరుడు భయాన్ని తొలగించేవాడు. ఆయన ఒక శునకం పై మానవ శిరస్సు పట్టుకున్నట్లు కనిపిస్తాడు. చిన్న పిల్లవాడిలా ఉండే భైరవుడి ముఖంలో అమాయకత్వం, స్వఛ్ఛత కనిపిస్తాయి. ఆయన చర్యల్లో ఎక్కడా వంచన కనిపించదు. ఆయన తన చేతిలో పట్టుకుని ఉన్న శిరసు ఎన్నో రకాలుగా విస్తరించిన భయాలు, అపనమ్మకాలు వ్యక్తమవుతున్న బ్రహ్మ ఐదవ శిరస్సు. ఈ ఐదవ శిరస్సు తన స్వీయ చిత్రాన్ని నిర్మించుకుంటుంది. శివుడు ధ్వంసం చేసిన త్రిపురాన్ని ఈ ఐదవ శిరస్సు నిర్మించుకుంటుంది. భైరవుడు స్వారీ చేస్తూ ఉన్న ఆ శునకం మనిషి మనస్సు. భయపడినప్పుడు అది ఏ విధంగా జంతు స్వభావానికి తిరిగి వెళుతుందో చూపబడింది.

ప్రతీకాత్మకంగా చెప్పుకోవాలంటే, హిందూ మతం లో శునకాలను అశుభంగా భావిస్తారు. శునకాలు వాటి యజమానులతో ఎక్కువగా బంధాల్ని కలిగి ఉంటాయి. వాటిని ఇష్టంగా చూసుకుంటే ఆదరణ చూపిస్తే అవి తోక ఊపుతూ, వాటిని పట్టించుకోకపోతే భాధగా ఉన్నట్లు తెలియజేయడానికి విచారంగా మూలుగుతూ ఉంటాయి. ఈ విధంగా శునకం చేసే ఈ చేష్ట “అహం” కి ప్రతీక. శునకం లాగే అహం కూడా పొగడబడినప్పుడూ, ఇతరుల దృష్టి తన మీద పడినప్పుడు పొంగిపోతుంది. ఎవరూ పట్టించుకోకపోతే దిగులు పడుతుంది. అహంకారానికి ప్రత్యేకించి తనకుగా ఎలాంటి స్వతంత్ర ప్రతిపత్తి, ఉనికీ లేదు. కానీ అది బ్రహ్మ చేత నిర్మితమైనది. భయాన్ని అధిగమించడానికి బ్రహ్మానందం మీద ఆధారపడింది. కానీ అది తన భయాలను మరింత గా విస్తరింపజేసుకుంది.

శునకాలు భూభాగ భావన ( టెరిటోరియల్ బిహేవియర్, ఈ ప్రాంతం నాదనే భావన ఉండటం) ని కూడా మనకి గుర్తు చేస్తాయి. శునకాలు ఒక స్థలాన్ని తమదిగా ప్రకటించుకునేందుకు మూత్రం విసర్జిస్తాయి. ఇంట్లో పెంచుకునే శునకాలే అయినా, వాటికి అన్ని రకాల రక్షణ కల్పించినా, వాటికి నమ్మకం లేక ఆ భూభాగం తమకి చెందింది అని నిరూపించడానికి మూత్ర విసర్జన ద్వారా ప్రామాణిక ముద్ర వేసుకుంటాయి. తమ సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు అవి మొరగడం, కరవడం కూడా చేయవచ్చు. ఎముకల కోసం మిగిలిన శునకాలతో పోట్లాటలకు దిగుతాయి. శునకాలు తమ మనుగడ కోసం ఏ విధంగా పోరాటాలు చేసుకుంటాయో, మనుషులు కూడా తమ తమ ఆస్తుల కోసం, తమ హక్కులను రక్షించుకునేందుకు కోసం ఘర్షణలకు దిగుతుంటారు. జంతువులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ మనిషి తన శరీరమూ, ఆస్తీతో వచ్చే స్వీయ భావన ( సెల్ఫ్ ఇమేజ్) ని రక్షించుకునే క్రమంలో ఉంటాడు. ఆస్తి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, కుటుంబం, సామాజిక స్థాయి కూడా అందులో వస్తుంది. ఆస్తి లేకపోతే, అర్థమే లేదు. అర్థమే లేకపోతే, అక్కడ మిగిలి ఉండేది భయం మాత్రమే.

శునకం పై స్వారీ చేస్తూ ఉన్న భైరవుడు మనకు మిగతా జంతువుల సహజ జ్ఞానాన్ని, ఆస్తి భావనని చెలరేపే విపరీత భయాలను గుర్తు చేస్తుంటాడు. శునకాల్లాగే మనం కూడా “నేను” ‘నాది’ అనే భావనలకు కట్టుబడి ఉంటాం. “నాది కాదు ‘ అనే భావనలో మాత్రం వాటికీ మనకీ భేదం ఉంటుంది. మనం దీన్ని ప్రేమ అంటుంటాం. కానీ వాటి వలన మనకి గుర్తింపు, సార్థకత ఉంటుంది. భైరవుడు మనల్ని ఈ బంధం నుంచి విముక్తం కావాల్సిందిగా ఉపదేశం ఇస్తున్నాడు. బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించి, మనోకల్పషాన్ని శుభ్రపరిచాడు. యథార్థముగా భయముక్తమైన ప్రపంచం ఎక్కడ ఉందో అన్వేషణ చేస్తున్నాడు.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి