🙏🌺🌺🙏
🌺పురాణాలలో ఉన్న విజ్ఞానం సాంకేతిక పరిభాషలో ఉంది. అంతేకాక, ఇవి జనసామాన్యాన్ని ఉద్దేశించి వ్రాసినవి కావడంచేత ఒక ప్రత్యేక పద్ధతిలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు సృష్టి ఆవిర్భావం, విష్ణుమూర్తి నిద్ర, ప్రళయం అనేవి కేవలం వాచ్యార్థాలు మాత్రమే తీసుకోవాల్సిన పనిలేదు. అవి సామాన్యులకు అర్థం కావడానికి చెప్పిన వైజ్ఞానిక రహస్యాలు. 🌺
🌺భూమి మండే అగ్ని గోళమని, అది చల్లబడిందని, దాని మీద నీరు ఏర్పడిన తరువాత మెల్లమెల్లగా సృష్టి ఆరంభం అయిందని చెబితే సామాన్యులకు అది అర్థం కాకపోవచ్చు. అలాగే విష్ణుమూర్తి నిద్రించినప్పుడు ప్రళయం సంభవిస్తుందని అప్పుడు నీరే భూమిని ఆక్రమిస్తుందని ప్రాణికోటి సమస్తం నశిస్తుందని చెప్పింది సామాన్యులకు అర్థం అవడం కోసం.🌺
🌺సృష్టికి కర్త, భర్తా ఒక్కడే. ఆయనే పరమాత్మ. ఆయనే అవ్యయుడు. తన మాయతో సృష్టిని కల్పించాడు. దాన్ని పెంపుచేయడానికి బ్రహ్మరూపంలో ఉద్భవించాడు. సృష్టిని పోషించడానికి విష్ణువుగా ఆయన అవతరించాడు. చిన్నపిల్లాడు కష్టపడి ఇసుకలో కోట కట్టి దాన్ని పడగొట్టి ఇంటికి వెళ్ళి నట్టు మహాశివుని చేత సృష్టిని పూర్తిగా నిర్మూలన చేస్తున్నాడు. కొంతకాలం మళ్ళీ కేవలం మండే భూగోళం, మంచు గోళం, నీటి గోళం తరువాత భూమి ఏర్పడుతుంది. దాని నుంచీ మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఇదే వైజ్ఞానిక రహస్యం పురాణాలలో చెప్పింది.
ఆధునిక పరిభాషలో చెప్పాలంటే పుట్టుక, పోషణ, ప్రళయం అనేవి ఒక పెరాబులా మాదిరిగా కొనసాగుతాయి. కొంత కాలం ఏ విధమైన జీవజాలం లేకుండా ఉన్న భూమి ఉండడాన్నే విష్ణువు నిద్రించడంగా వర్ణించిందని చెప్పవచ్చు. అణువణువునా నిండి ఉన్న పరమాత్మకు నిద్రేమిటి? అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. ఆయన నిద్రను ప్రాణి రహిత భూమి సమయంగా ఆధునికులు గ్రహించాలి. 🌺
🌺ఇదే కూర్మపురాణం రెండవ అధ్యాయం చెబుతోంది. శేషశయ్యమీద విష్ణువు శయనించడం అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రాలను అధ్యయనం చేసినవారు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నిజానికి విష్ణువు, బ్రహ్మ అంటూ ఎవరూ లేరు. ఉన్నది మహాకాలుడు మాత్రమే. ఆయనే ఇసుక కోటలు కూల్చివేస్తాడు. మరలా ఇసుకలో బొమ్మరిళ్ళు కట్టాలనుకున్నప్పుడు ఆ పరమశివుని నుంచీ విష్ణువు, బ్రహ్మ ఉద్భవిస్తూ ఉంటారు. వారు తమ విధులు నిర్వర్తించి ప్రళయకాలంలో సృష్టి, స్థితి అవసరాలు లేవు కనుక తిరిగి పరమేశ్వరునిలో లీనం అయిపోతారు. ఆ పరమాత్మ మహేశ్వరుడు. ఆయనే సర్వేశ్వరుడు. 🌺
🌺ఇక్కడ అతి ముఖ్యమైంది మహాలక్ష్మి. ఈమె మహామాయా స్వరూపిణి. ధనమాయలతో జీవులను పరిగెత్తేట్టు చేస్తుంది. ఈమె లేకపోతే సృష్టి స్తబ్దుగా ఉండిపోయింది కనుక ఆమెను సృష్టించాడు పరమాత్మ. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలోని వారు కూడా ప్రాణులు పనులు చేయడానికి ప్రేరణ ధనవస్తుకనకభోజనసుఖాలు అని ఒప్పుకుంటున్నారు. ఇవే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. 🌺
🌺సృష్టికి ముగ్గురు అధిదేవతలున్నా లక్ష్మీదేవి మాత్రమే మూలచోదనం. కనుక ఆమెను అర్చిస్తే సిరి కలుగుతుంది. పుష్టి కలుగుతుంది. మేధస్సు కలుగుతుంది. కీర్తిప్రతిష్టలు కలుగుతాయిఅన్నిటికీ మించి బలవంతులు అవుతారు.🌺
వ్యాఖ్యానించండి