🌺 భక్తి అంటే ఓ పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది.
🌺 భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగ పేర్కొన్నది. భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
1. శ్రవణ భక్తి: ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వానం పెరుగుతుంది.
2. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది.
3. స్మరణ భక్తి: భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకుని స్మిరించుట స్మరణ భక్తి.
4. పాదసేవన భక్తి: భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం.
5. అర్చన భక్తి: ప్రతిరోజూ తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి.
6. వందన భక్తి: వందనం అనగా నమస్కారం. తన యందు మనసు నుండి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించారు.
7. దాస్య భక్తి: ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి.
8. సఖ్య భక్తి: సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు.
9. ఆత్మ నివేదన భక్తి: ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం.
వ్యాఖ్యానించండి