👉 కొబ్బరికాయ : దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి .
👉 అరటి పండు : భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది . అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు . చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది .
👉 నేరేడు పండు : శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి , నడుమునొప్పి , మోకాళ్ల నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు .
👉 ద్రాక్ష పండు : భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు , తరవాత పెద్దలకు పంచినట్లయితే , ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు . రోగాలు నశిస్తాయి . కార్యజయం లభిస్తుంది .
👉 మామిడి పండు : మామిడి పండుని నైవేద్యంగా పెడితే రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది .
నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడిపండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు .
👉 సపోటా పండు : సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి .
👉యాపిల్ పండు : భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి , ధనవంతులవుతారు .
👉కమలా పండు : దేవుడికి కమలా పండుని నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి .
👉పనస పండు : పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం , రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు .
వ్యాఖ్యానించండి