ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

మంగళవారం కటింగ్ ఎందుకు చేసుకోకూడదో తెలుసా ?

సాధారణంగా అందరూ మంగళవారం మరియు శుక్రవారం రోజున బార్బర్ షాప్ కి వెళ్ళరు. మంగళవారం నాడు జుట్టు కత్తిరించు కోరు. అయితే ఎందుకు ఇలా మంగళవారం రోజున జుట్టు కత్తిరించు కోకూడదు, క్షవరం చేయించుకోకూడదు అన్న విషయం అందరికీ తెలియకపోవచ్చు. అయినప్పటికీ ఇది హిందువులు ఎప్పటి నుంచో పాటిస్తున్నటువంటి ఆచారం అయినందున అందరూ ఇదే నియమాన్ని ఆచరిస్తున్నారు. అయితే ఇంతకీ మంగళ మరియు శుక్ర వారాల్లో తలనీలాలు ఇవ్వడం కానీ కత్తిరించు కోవడం కానీ చేయకూడదు, ఎందుకు అనగా వీటికి పురాణాలు, మన పెద్దలు పలు కారణాలను చెప్పబడి ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారానికి అధిపతి కుజుడు అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కుజుడు చాలా వరకు కలహ కారుడు అని ప్రతీతి. అదే విధంగా మన శరీరంలోని రక్తానికి కారకుడు కూడా కుజుడే. మంగళవారం రోజున కుజుని యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఈ రోజున కత్తితో గాని, కత్తులతో కానీ చేసే పనులు దగ్ధం అవుతాయని, రక్తం కళ్ల చూసే సమస్యలు ఎదురవుతాయని కాబట్టి మంగళవారం నాడు తల నీలాలు ఇవ్వడం కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ క్షవరం చేయించు కోవడం వంటి పనులు కానీ చేయరాదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకనే మంగళవారం రోజున కటింగ్ షాపులు కూడా అసలు ఎక్కడా కనిపించవు.

అదే విధంగా శనివారం నాడు కత్తి మన శరీరంపై పడినట్లయితే శనిని నెత్తిపై పెట్టుకుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని.. ఇక వరుస కష్టాలు సమస్యలు తప్పవని చెప్పబడింది.
అలాగే మంగళవారం నాడు కటింగ్ చేయరాదు ఇలా చేసినట్లయితే కుజుని యొక్క ఆగ్రహానికి గురవుతారని పురాణాల్లో ఉంది. కావున మంగళవారం నాడు జుట్టును కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం మరియు గోళ్ళు కొరకడం వంటి పనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరాదు.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి