ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ధర్మ సందేహాలు – దశమహవిద్యలు – ధూమావతి విశేషాలు

దశమహవిద్యలు – ధూమావతి విశేషాలు :
ఇక్కడే చాలా చిత్రమైన కాంట్రెస్ట్ ఉంది . ఈ హిందూ సమాజంలోనే శతాబ్దం క్రితం సతీసహగమనం ఒక ఆచారంగా అమలైంది .. భర్త చనిపోతే , భార్యను సజీవంగా చితిపైన దహనం చెసిన దురాగతమైన ఆచారం చాలా కాలం అమల్లో ఉంది . సతీసహగమనం అనంతరం .. భర్త చనిపోయిన భార్యకు అలంకారాదులు నిషేధమయ్యాయి . పునర్వివాహం అబ్బురమైంది . పునిస్త్రీల మధ్య గౌరవాదులు మృగ్యమయ్యాయి . చివరకు ఆమె కనిపిస్తేనే అపశకునమన్నంత విశ్వాసం ప్రబలి పోయింది . ఇవాళ భర్త చనిపోయిన మహిళ అలకారాలలో కొంత మార్పు కనిపిస్తున్నప్పటికీ , ఆచార వ్యవహారాల్లో మాత్రం ఆమె దూరంగానే ఉంటోంది . ఇదంతా ఒకే .. ఈ విశ్వాసాలలో మార్పు రావడానికి ఇంకా టైం పడుతుంది . కానీ మీకు తెలుసా !? ఇదే హిందూ సమాజం .. ఇదే హిందూ ధర్మం .. ఇదే భారత ఆధ్యాత్మిక క్షేత్రం .. ఇక్కడి మంత్ర , తంత్ర శాస్త్రవేత్తలు , సిద్దులు ఒక విధవరాలి రూపాన్ని దేవతగా పూజిస్తున్నారు . అసలు ఇలాంటి రూపాన్ని పూజించటమే మనలాంటి వారికి విడ్డూరంగా కనిపిస్తుంది . ఆమెను చూస్తే ఆశ్చర్యమేస్తుంది . ఆమె పేరే ధూమావతి . వెలవెలబోయిన బూడిద రంగు శరీర ఛాయ . మాసిన గుడ్డలు , విరబోసుకున్న జుట్టు .. వేలాడుతున్న స్థనాలు , పొడువాటి ముక్కు , క్రూరమైన చూపు , ఎప్పుడు పోట్లాడే స్వభావం , భయాన్ని కలిగించే మూర్తి .. నిరంతరం ఆకలితో అలమటిస్తున్నట్లు కనిపించే లక్షణాలు.. అన్నింటికీ మించి బొట్టు లేని అమంగళ రూపం . చేతిలో చాట .. కూర్చోవడానికి ఓ రథం .. ఆ రథంపై కాకి ధ్వజం .‌ ఏంటి విచిత్రం .. అసలు ఇలాంటి రూపాన్ని చూస్తేనే ఒక రకమైన విరక్తి కలుగుతుంది .. అలాంటి రూపాన్ని దేవతగా ఎలా పూజిస్తారు .‌ ? ఓ ప్రక్క విధవరాలు కనిపిస్తేనే అపశకునంగా బావించే సమాజం మనది .. అలాంటి సమాజంలోనే ఇలా అమంగళ రూపాన్ని దశమహావిద్యల్లో ఒకటిగా చేర్చడం .‌ ఉపాసించడం ఆశ్చర్యమేస్తుంది .. కానీ ఇక్కడ నిజంగా ధూమావతి ఉపాసన జరుగుతోంది .‌ ఈమె దశమహావిద్యల్లో ఏడవ విద్యగా ఉపాసించబడుతోంది . ఈ విద్యల్లో నెగిటివ్ విద్య ఈ దూమావతె ..‌ మనకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ … జాగ్రత్తగా ఆలోచిస్తే , ఆలోచించడం అంటే శాస్త్రాలు, పురాణాలపై పాండిత్యం అక్కర్లేదు . అంత సంపాదించాల్సిన పని లేదు . అది సిద్దులకు మాత్రమే సాధ్యం . ఇన్ జనరల్ గా ఆలోచిస్తే దశమహవిద్యలు అన్న పేరులోనే నాలేల్జ్ ఉంది. ఈ పది మందిని దేవతలని ఎక్కడా పిలవలేదు . ఈ శక్తి రూపాలన్నింటీనీ విద్యలనే పిలిచారు . అందులోనే రహాస్యమంతా దాగి ఉంది. దశమహావిద్యల్లో మొదటి విద్య నుంచి చివరి విద్య వరకూ కూడా అనంత శూన్యంలో సృష్టి నిర్మాణం నుంచి జీవజాలం ఉనికి , జీవితం , మరణం , మళ్లీ పుట్టుక వరకూ రోదసి నుంచి ఆకాశం మీదుగా భూమి అందుండి భూగర్భంలో దాగి ఉన్న అనేక రహాస్యాలన్నింటినీ ఈ విద్యలు వ్యక్తం చేస్తున్నాయి . ఇదిగో ఈ ధూమావతి మనలోని నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నింటికీ ఓ సింబల్ . ధూమావతి మనలోని అన్ని రకాల నెగిటివ్ ఫోర్సెస్ ను ప్రతిఫలింపజేస్తుంది. అనంతమైన ప్రాణాధార శక్తిని చిన్నమస్త అందిస్తే , ఆ తర్వాత మనలోని ప్రతీకూలాంశాలన్నింటీనీ ధూమావతి చూపిస్తోంది . మనలోని అలసత్వం , ఎప్పటికి సంతృప్తి చెందకపోవడం , ఎంతకీ కడుపు నిండక ఆకలితో ఉండటం , మధ్యపానాదుల వంటి దురలవాట్లు , సంతోషమే లేనితనం , వీటన్నింటికీ కూడా ధూమావతీ ఒక ప్రతీక . దశమహావిద్యల్లో ధూమావతి ప్రత్యేకంగా అధిదేవత . మనం ఎదగటానికి , పెరగటానికి , నిలబడటానికి అడ్డంకిగా మారే ఈ శక్తులన్నింటికీ దూరంగా ఉండమని చెప్పడమే ధూమావతి రూప లక్ష్యం . ఈ ప్రతికూల గుణాలన్నింటి నుంచి జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకోమని ధూమావతి చెబుతుంది . ధూమావతి చేతిలో చాట పట్టుకుని ఉంటుంది . చాట మనకు ఎందుకు ఉపయోగపడుతుందో తెలియంది కాదు . బియ్యంలోంచి రాళ్ళు ఎరివేయటానికి చాటను వాడుతారు. ధూమావతిలోని ఈ చాట మనలోని నెగిటివ్ శక్తులను ఏరివేయాలన్న సందెశాన్ని ఇస్తుంది . బయటి నుంచి రూపాన్ని గమనిస్తే దారిద్ర్యానికి , బాధకు , దురదృష్టానికి సింబల్ గా ధూమావతి కనిపించినప్పటికీ , లోపలి లెవల్ కు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన జీవితంలో హార్డ్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకునే గుణపాఠాలన్నింటికీ ధూమావతి ప్రతీక .. అసంతృప్తులు , చికాకులు , విసుగు , విరక్తి , వేధింపు , ఓటమి , నష్టం , బాధ , ఒంటరితనం అన్ని కూడా మన జీవితంలో ఎదురయ్యే భరించలేని అనుభవాలు . ఇవి లేకుండా మనకి జీవితం బ్యాలెన్స్ గా ముందుకు సాగనే సాగదు . ఈ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకొమని ధూమావతి మనకు సూచిస్తోంది . వీటన్నింటి నుంచి దూరంగా ఉండాలని చెప్తోంది . ఇక్కడ మనం గమనించాల్సిన మరొకటి ఉంది . ఈమె చీకటిని ఎక్కువగా ఇష్టపడుతుంది . ధూమ అంటే పొగ అని అర్థం . ఈ పొగ దట్టంగా ఉంటుంది . ఇది అమావాస్య చీకటికి ప్రతీక . మనం జనరల్ గా వెలుతురును పాజిటీవ్ గా , చీకటిని నెగిటివ్ గా చూస్తాం . వెలుతురును విద్యగా భావిస్తే , చీకటిని అవిద్యగా చూస్తాం . అంటే విద్యతో పాటు అవిద్యను కూడా మనం తెలుసుకోవాలి . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అనుకూల వ్యతిరేక కోణాలను రెండింటి గురించి కూడా మనకు పూర్తి అవగాహన ఉంటేనే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది అనడానికి ధూమావతి ప్రతీక . ఇక విధవరాలి రూపం . ఇది అమంగళం .. ఆమె అలక్ష్మీ . ఈ రూపానికి కారణం ఏమిటి ? భారతీయ సమాజంలో స్త్రీ జీవితానికి సంబంధించి ఒక భాగానికి ముగింపు ఈ రూపం ‌ . సాధారణంగా విడో అంటే మన సమాజం ఒక బాధాకరమైన జీవితంలోకి ఆమెను పెడుతుంది. కానీ , వాస్తవానికి విడో అంటే ఒక అనంతమైన శక్తి స్వరూపం . ఈశ్వరుడు లేని శక్తి . అన్ని రకాల బంధనాలు , బాద్యతలు , విధులు తెంచుకున్న మహిళ . మన సమాజం ఆమెకు స్వాతంత్ర్యం లేకుండా చేసిందే తప్ప హిందూ ధర్మం ఆమెకు స్వాతంత్ర్యం లేకుండా చేయలేదు . సమాజం లో మనం చేసే పనులన్నింటికి శాస్త్రం , ఆచారం , ధర్మం పేరు చెప్పుకోవడం వల్లనే ఎవరు పడితే వారు , ఎలా పడితే అలా దాడి చేసే పరిస్థితి నెలకొంది . ధూమావతి రూపం మనం చేయాల్సింది ఏమిటో విస్పష్టంగా చెప్తోంది . ఈమె విధవరాలి రూపాన్ని అనంతమైన శక్తి స్వరూపంగా చెప్పడానికి ప్రతీకాత్మకంగా ఒక కథ కూడా ఉంది .. భార్యాభర్తల దాంపత్యానికి మూలమైన ప్రకృతి పురుషులైన పార్వతీపరమేశ్వరులు కైలాస పర్వతం మీద ఉన్నారట .‌ పార్వతి దేవికి విపరీతమైన ఆకలి వేసింది .‌ తన ఆకలి తీర్చమని పరమశివుని ప్రార్థించింది .‌ కానీ ఆమె ఆకలిని పట్టించుకోలేదు . దాంతో విపరీతంగా కోపగించిన పార్వతీ దేవి ఒక్కసారిగా పరమేశ్వరుడిని ఎత్తి కింద వేసిందిట .‌…. ఆ సమయంలో దట్టమైన నల్లటి పొగ ఆమె శరీరం లోంచి ఆమె కోపాగ్ని నుంచి వెలువడిందిట . అప్పుడు శివుడు అన్నాడట … నీ లోంచి వచ్చిన ఈ పొగ వల్ల నీ రూపం నలుపై సుందరం లేకుండా మారుతుంది .. నిన్ను ధూమావతి అని పిలుస్తారు .. అని అన్నాడట .. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కథను కాదు , కథలోని సారాన్ని , స్త్రీ ఒక దశ వరకు తనకున్న బంధానాలతో , బాధ్యతలతో , వీలైనంత ఓపికగా వ్యవహరిస్తుంది . లేకుంటే పార్వతీ శివుడినే లెక్క చేయదు . అంటే భర్తను సైతం లెక్క చేయదు . ఆమె స్వయం నియంత్రణ శక్తి కలిగింది . కుటుంబంలో , సొసైటీలో అన్ని బందనాలు ఉండవు .. ఏమి చెయనక్కరలేదు . ఆమె తనకు తాను మాత్రమే ఉండేందుకు ఇష్టపడుతుంది . బ్రహ్మచర్యాన్ని ఇష్టపడుతుంది . సింపుల్ గా చెప్పాలంటే అన్నింటినీ విడిచి పెట్టి మహిళా సన్యాసిగా ఉండాలని భావిస్తుంది . ఇలాంటి వారు మనకు ఉత్తర భారతలో ఎక్కువగా కనిపిస్తారు . ఒక రకమైన ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రయాణం చేస్తుంది . అంతే కానీ , విధవరాలంటే ఆమెను అన్ని రకాలుగా దూరంగా ఉంచాలని , మంగళప్రదమైన కార్యాలలో భాగస్వామిని చేయరాదని అర్థం కాదు .భర్త దూరమైన తర్వాత తానుగా సంపూర్ణ స్వేచ్ఛ తో జీవించడం , అన్ని కోరికలకు , బాద్యతలకూ అతీతంగా తనదైన జీవితాన్ని గడపడం అన్నదే ఈ ఎటర్నల్ విడోలోని అంతరార్థం . ఇలా కాకుండా సమాజంలో మళ్లీ భర్త , బంధనాలు , బాధ్యతలతో మమేకం కావాలనుకునే వారిని అలా చేయకూడదని ఏ ధర్మం చెప్పలేదు . తరువాతి కాలంలో మన సొసైటీ నిర్మించుకున్న ఆచారాలే ఇవి . ధూమావతిలో కనిపించె మరో ప్రధానాంశం నల్లని దట్టమైన పొగ . శ్మశానంలో చితి మంటల్లో నుంచి వెలువడే పొగ ఆమె ఉనికి . ఆమె ఫాల్స్ ఆంబిషన్స్ ను ధహనం చేస్తుంది . అహాన్ని అంతం చేస్తుంది . మనలో పైకి కనిపించే యూత్ నెస్ , ఫ్రెష్ నెస్ ను దగ్దం చేసి లోపల ఉన్న మరో రూపాన్ని వ్యక్తం చేస్తుంది . ప్రకృతిలోని తేజస్సు వెనుక ఉన్న చీకటిని ఆమె ప్రతిఫలిస్తుంది . అంతా అయిపోయిన తర్వాత ఏమీ లేనితనానికి ఈమె ప్రతీక . కాళరాత్రి . అంటే భయంకరమైన చీకటి నుండి వెలుతురు మళ్లీ వచ్చేదాకా , పురాణ పరిభాషలో చెప్పాలంటే , సృష్టి అంతం కావడానికి , తిరిగి ప్రారంభం కావడానికి మధ్యన ఉండే ఏమీలేనితనం ధూమావతి . మనకి కనిపిస్తున్నది మాత్రమే నిజమని … ఇది మాత్రమే ఉన్నదని మనం బావిస్తుంటాం … కానీ మనకు కనిపించని ఒక శూన్యం ఏదో వెరె ఉంది . మనకు కలలోస్తాయి . ఆ కలల్లో ఏవో కనిపిస్తుంది . లేచి చూస్తే అవి కనిపించవు . అంటే అసలు లేనితనం అంటే ఏదీ లేకపోవటం కాదు … శూన్యంలోనూ తెలియనిదేదో దాగి ఉందనేది స్పష్టం . వీటి కోసం అంతరిక్ష స్థాయిలో జరుగుతున్న పరిశోధనలను మనం ఇప్పటికే గొప్పగా చెప్పుకుంటాం .. ఇదిగో ఈ శూన్యం గురించి దశమహవిద్యలు విస్పష్టంగా సవివరణాత్మకంగా వెల్లడిస్తున్నాయి … ఈమె రథంపై ఉన్న కాకి ధ్వజం ప్రేత చిహ్నం . ఎవరైనా చనిపోయినప్పుడు మనం కాకి వచ్చి దాన్ని స్పృశించి పోవడం మనకు తెలిసిందే.. ఒకవేళ ముట్టుకోకపోతే అందుకు కావలసిన వివిధ ప్రక్రియలను మనం పాటిస్తొం . మరణానంతరం రెస్ట్ ఇన్ పీస్ అని మనం సహజంగా వాడే జాతీయానికి కాకి ప్రతీక . అది సంతృప్తి చెందితే తద్వారా మరణించిన వారి ఆత్మ ప్రశాంతంగా దివ్యలోకాలకు ప్రయాణిస్తుందిట . ధూమావతికి సంబంధించిన ఉపాసన చాలా తీవ్రమైంది . అష్టాక్షరీ మంత్రాన్ని లక్షసార్లు జపించాలి .. శత్రువులపై , విరోధ శక్తులపై ఆధిపత్యానికి ఈ ఉపాసన అత్యంత ముఖ్యమైంది అని భావిస్తారు .. ఇది శ్రీవిద్యామార్గంలో సాగే ఉపాసన , ఈమెను ఉపాసించేందుకు బీజాక్షరం ( ధూం ) ….

ధూమావతి , తన ప్రబావములను కేతువు రూపంలో మనకు చూపిస్తుంది . రాహువు వలన , కేతువు వలన డబ్బు పై గానీ , సుఖాలపై గానీ , పెరు ప్రతిష్టిలపై గానీ ఎలాంటి మక్కువలేని నిజమైన వారు వస్తారు . రాహువు యొక్క మాయను దాటిన తర్వాతే , జాతకుడు ఈ కేతు గ్రహానికి తలవంచాల్సి ఉంటుంది . ధూమావతి తంత్ర సాధన కొంత కష్టమైనది … ధూమావతి సాధన చేసిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది .. ఎందుకు అంటే కేతోః మోక్షకారకాః అంటాం .. జన్మకుండలిలో లగ్నంలో కేతువు ఉన్నా , కాలసర్పదోషం ఉన్నా , కేతుమహాదశ జరుగుతున్నా , విచిత్ర అంటురోగాలు అంటుకున్నా , చేతబడి లాంటి తంత్రాల బారిన పడినా , జీవిత సమయంలో ఎంతోకాలం జైలులో ఉన్నా , నేరచర్య వలన కోర్టు తీర్పు కొరకు వేచి ఉన్నా , మరణ శిక్ష పడి చాలా కాలం పాటు కుటుంబానికి దూరం అయిపోయినా , శూన్యంలో ప్రయాణిస్తున్నా ఇలాంటి జాతకులు అందరూ కూడా ఈ ధూమావతిని గురుముఖతః విధివిధానాలు తెలుసుకుని ధూమావతిని సాధన చేయాలి … శూన్యంలో ప్రయాణం , రీసెర్చ్ అండ్ సినిమా డైరెక్టర్లు ఈ రంగాలు అన్నింటికీ ధూమావతి ఆధిపత్యం వహిస్తుంది …

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి