హనుమజ్జయంతి చైత్రంలోనా , వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంటుంది…
అలాంటప్పుడు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు…
పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలుస్తుంది…
అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు…
పురాణాల ప్రకారం ఈరోజు హనుమంతుడు, సీతామాత దర్శనం గావించుకొని, ఆసురాలను చంపి, మళ్ళీ తిరిగివచ్చిన రోజు కాబట్టి, కొంతమంది విజయ దివస్ అని, మరికొందరు విజయోత్సవ దినం అని పండుగ జఫుపుకొంటారు…
అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కూడా చెబుతున్నాయి…
ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది.
దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు.
చాలామంది భక్తులు చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేపట్టి ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు.
ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు, వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు…
హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. “కలౌ పరాశర స్మృతి:” అని శాస్త్రాలు చెప్తున్నాయి.
శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది.
దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.
ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు…
🌷శుభమస్తు🌷
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి