ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ధర్మ సందేహాలు – భగవంతుడు – భక్తులకు ఎప్పుడు వశమౌతాడు – ఎలా వశమౌతాడు???

గర్భగుడిలోని విగ్రహాన్ని బాగా మందంగా ఉన్న తెరనుండి చూస్తే కనిపించదు.
అదే పలుచని తెరగుండా చూస్తే మసక మసకగా కనిపిస్తుంది.
అదే పోలిధిన్ పేపరు ద్వారా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది.
నిర్మలమైన అద్దం గుండా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే ఈ క్షేత్రాల యొక్క వాసనల తెరను బట్టి పరమాత్మ వేరు వేరుగా కనిపిస్తుంటాడు…

తమోగుణాన్ని పూర్తిగా విడిచిపెట్టి,
రజోగుణాన్ని తగ్గించుకుంటూ,
సత్వగుణాన్ని పెంచుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటారో … అట్టి వారిలో పురుషుడు భర్తగా ఉంటాడు…
సాధారణంగా భర్త ఏం చేస్తుంటాడు..???
భార్య కోరికలు తీరుస్తూ, ఆమె బాధలను, కష్టాలను తొలగించటానికి ప్రయత్నిస్తూ, భరిస్తూ ఉంటాడు…

అలాగే రజోగుణాన్ని తగ్గించుకొంటూ సత్వంలో నిలవటానికి ప్రయత్నిస్తూ ఉండే భక్తుని భగవంతుడు భర్త లాగా భరిస్తూ ఉంటాడు.

అతడికి ( భక్తుడికి ) కష్టనష్టాలు వస్తే వాటిని తొలగించటానికి ప్రయత్నిస్తాడు, అతడి పోషణ భారం కూడా తానే వహిస్తాడు, వారి కోరికలను తీరుస్తూ ఉంటాడు…

🌿శుభమస్తు🌿
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి