ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ధర్మ సందేహాలు – భగవత్సాక్షాత్కారము

🌷ఈ సకల చరాచరసృష్టి కారణభూతమైన వాడు, సమస్త జీవ్ఞల ఉత్పత్తికి మూలకారణమైన వాడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే. దీనిని విశ్వసించి సేవించినవారు ఆయన అపారకరుణకు పాత్రులవుతారు.

🌷నమ్మకం అనే పునాది మీద భక్తి నే భవంతిని ఎంతయిన పెంచుకుంటూపోవచ్చు.

🌷భక్తవత్సలుడు అయిన ఆ భగవానుడు ఆర్తితో పిలిచిన వారి చెంతకు పరుగున వచ్చి తీరతాడు.

🌷నమ్మకంతో నారాయణ నామాన్ని స్మరించినన ప్రహ్లాదుని తరింపచేయాటానికి ఉగ్రనరసింహమూర్తిగా స్తంభం నుంచి వెలుబడ్డాడు.

🌷భక్తులలో అగ్రగణ్యుడైన ఆంజనేయుని హృదయంలోనే కొలువు తీరాడు శ్రీరామచంద్రుడు.

🌷ఆర్తత్రాణ పరాయణుడైన ఆ భగవానుడు భక్తుల మొరనాలకించి వారిని సంరక్షించడానికి ఉన్నపళంగా ఆఘమేఘాల మీద పరుగులిడి వస్తాడు అనడానికి మనకు గజేంద్రమోక్ష ఘట్టం చక్కని తార్కారణం.

🌷మనకు సంకట పరిస్థితులు ఎదురై దిక్కుతోచని స్థితిలో దేవుడా! నీదేభారం అని శరణాగతి చేసినపుడు ఏదో ఒకరకంగా మన సమస్యకు పరిష్కారం లభించి తీరుతుంది.

🌷నస్సహాయస్థితిలో భగవంతునిపై భారం వేసి, చేతులు జోడించి నమస్కరిస్తే, దైవం మానుషరూపేణ, అన్నట్లు వెన్నంటే ఉండి ఆపదల నుండి గట్టెక్కించేది ఆ దేవదేవుడే. ఈ సత్యాన్ని మనం గ్రహించలేనంత అజ్ఞానంలో ఉంటాం.

🌷కష్టాలు తొలగిపోయి సుఖాలు వచ్చిన సమయంలో ఆ దేవుని విస్మరిస్తారు. సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు దుఃఖించనివాడు, కోరికలు లేనివాడు, శుభాలను, అశుభాలను పరిత్యజించిన వాడు నా భక్తుడు అన్నాడు గీతాచార్యుడు.

🌷కలిగియుగంలో మానవులకు భగవంతుని దర్శించుకునే అదృష్టం లేదని, ఆయనెవరికీ కనిపించడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కాని ఏకాలానికి తగినట్లుగా ఆకాలంలో భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. సర్వకాల సర్వావస్థలలోను మనలను కంటికి రెప్పలా కాపాడటంలో ఆ పరమేశ్వరుడు నిమగ్నమై ఉంటాడు.

🌷కని దానిని పెడచెవిన పెట్టిన వారు దుర్మార్గపు పనులు చేసి ఇక్కట్ల పాలవుతూ ఉంటారు. తెలుసుకున్న వారు జాగ్రత్త పడి సన్మార్గంలో పయనిస్తారు. చిత్తశుద్ధితో చేసే పనిపట్లు అకుంఠిత దీక్ష కలిగిన వారు పనిలో కూడా పరమేశ్వరుని దర్శించగలుగుతారు.

🌷నర్మలమైన అంతఃకరణ కలిగి ఉన్నవారు భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. సత్యంలోను, ధర్మంలోను, శీలంలోను నీతిలోను, నిజాయితీలోను, న్యాయంలో, ప్రేమలో పసిపిల్లల బోసినవ్వుల్లో, ఆ పన్నులను ఆదుకొనే అమృత హస్తాల్లో ఇలా భగవంతుడు అంతటా ఉన్నాడు. పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తితో ధ్యానిస్తే మనకు ఆ భగవంతుని సాక్షాత్కారం తప్పకుండా ఏదో ఒక రూపంలో లభిస్తుంది.

☘️☘️☘️☘️☘️☘️☘️
జై శ్రీమన్నారాయణ 🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి