ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

భగవంతుడిని మనము – ఏమి కోరుకోవాలి?

కొరికాలకెళ్ల ఉత్తమమైన కోరిక ఏమంటే – కోరికలు లేకుండా చేయమనే కోరికే – ఉత్తమ కోరిక.

భగవంతుడిని కోర్కెలు తీర్చమని అడగడం మాత్రమే కాదు. అసలు కోర్కెలే లేకుండా చేయమనే ఉత్తమ కోరికను కూడా అడగాలి.
అంతఃకరణ నిర్మలంగా మారటానికి నిష్కామస్థితి ఏర్పడాలి. నిర్మలమైన మనసు ప్రత్యేకంగా కొందరిపై దయ, మరికొందరిపై ద్వేషం కలిగి ఉండదు. సమదృష్టితో ఉంటుంది…
ఏ ఒక్కరినీ హింసించదు. దౌర్జన్యం చేయదు.
శారీరక సుఖం కోసం దీనత్వం ప్రదర్శించదు. దేనిపైనా ఆశ పడదు, కలవరపడదు…
అది స్వస్వరూపస్థితికి చేర్చి ఆత్మానందాన్ని ఇస్తుంది…
మహాత్ములు అలా ఉండి మనకు తమ జీవన విధానాన్ని బోధగా అందిస్తున్నారు.
ప్రాప్తం కాని దానిగురించి యోచించనివాడు, ప్రాప్తవిషయాలను తిరస్కరించని వాడు, ధర్మాచరణ కర్తవ్యం తప్ప నేను, నాది అనే కర్తృత్వానికి తావివ్వని వాడే జ్ఞాని.

ఆ సుగుణాలే వారి నుండి మనం నేర్చుకోవాల్సిన సద్భోధ ..

🙏సమస్త లోకా సుఖినోభవన్తు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి