పరమేశ్వరుని సృష్టిలో మనుష్యునకు ఇచ్చిన అపూర్వమైన కానుకలు మూడు…
మొదటిది మాట,
రెండవది నవ్వు,
మూడవది బుద్ధి.
ఈ మూడింటిని నిరంతరం వాడుకుంటూ మనిషి ఎదగాలి. ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకో గలిగిన శక్తి ని మనకు బుద్ధి ఇస్తుంది.
దీనిని మనం సమర్ధంగా వినియోగించుకోవాలంటే శాస్త్రాన్ని బాగా చదవాలి, పెద్దల మాటలు ఒంట పట్టించుకోవాలి.
మహాత్ముల జీవితాలను బాగా పరిశీలించాలి….
అంతే కాని నాకు తెలిసిందే మంచి, నేను చెప్పినదే వేదం, ఇదే భగ్వద్ వాక్కు అని ఎప్పుడూ అనుకోకూడదు.
మనిషి జీవితాంతం విద్యార్థిగా తెలుసు కుంటూనే ఉండాలి, అదే జ్ఞాని యొక్క లక్షణం,
ఒకప్పుడు మంచిగా ఉన్నది మరొకప్పుడు చెడు అవుతుంది, చెడుగా ఉన్నది మంచి అవుతుంది.
సందర్భాన్ని బట్టి తెలుసుకోలేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి….
అలాగే ఎప్పుడు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే విచక్షణ బుద్దిచేత పెరగాలి.
అబద్ధం చెప్పడం తప్పు, కానీ అహింస కోసం, ఇతరత్రా ప్రాణాలను రక్షించడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు…
ఒక్కొక్కసారి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చిన్న అధర్మం చేయాల్సి ఉంటుంది, పెద్ద సత్యాన్ని నిలబెట్టడానికి చిన్న అబద్ధం ఆడాల్సి ఉంటుంది.
దేశ సరిహద్దుల్లో నిలబడిన సైనికుడు ఎప్పుడూ ఆయుధాలు ధరించి ఉంటాడు, హద్దుమీరి సరిహద్దు రేఖ దాటి అవతలివాడు కాలు ఇవతల పెడితే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాడు.
అంతే అది తప్పు కాదు, దేశ సంరక్షణ కోసం అలా కాల్చవలసిందే.
అయ్యో.. సాటి మనిషిని అలా కాల్చేయడమేమిటి.. అని కూర్చుంటే దేశం ఎక్కడుంటుంది.. మనం ఎక్కడుంటాం.. ఆయన కాల్చాడు కదా అని మీరూ, నేనూ హద్దు మీరకూడదు, అందువల్ల మనం ఉన్న స్థితిని బట్టి ధర్మం మారుతుంది.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి