ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

దివ్యత్వం అనగానేమి? – దివ్యత్వం యొక్క ప్రత్యేకత ఏమిటి?

“సృష్టి, స్థితి, లయము” ఈమూడింటికీ, ముగ్గురు ప్రధానులున్నారు, సమస్త జీవుల చేత, సమస్త నియమములను, పాటింపజేయుటే ఈ సృష్టి యొక్క ఘనత…
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కు ఈ బాధ్యత అప్పగించబడింది.
ఈ త్రిమూర్తులకు, అధిపతి దైవము…(GOD) ఈముగ్గురూకేవలం మినిష్టర్స్ వంటి వారు మాత్రమే, వీరందరి పై, అధికార, ఆధిపత్యము వహించినవాడు, దేవుడు.
ఈ దైవము, అణు స్వరూపుడై, సర్వత్రా వ్యాపించి యున్నాడు.
ఇతని పేరే ఆత్మ , ఇదే యావత్ సృష్టినంతా పరిపాలన జరుపు చున్నది…
కేవలం సాక్షీభూతుడుగా ఉన్నాడు కాని, ఫలము మాత్రమూ మనకు మనమే అనుభవించాలి.
ఈ త్రిమూర్తులతో మనం స్నేహం సంపాదించు కోవాలి… అది ఎలా??? వారిని ప్రసన్నంగావించుకొనే, నిమిత్తమై, నామస్మరణ, జపము, ధ్యానమూను, చేయాలి,

దైవము ధర్మ స్వరూపుడు. ఏరూపమునైనా , ధరించవచ్చు , కాబట్టి సాకారం, నిరాకారముగాను కూడా దైవమే ఉంటుంది ( మట్టి, కుండ,లాగ )
ఐతే, మన హృదయము, దైవ భావముతో, సంపూర్ణముగా నింపుకుని, డైరెక్ట్ గా దైవముతోవే సంబంధ బాంధవ్యాలు కల్పించు కోవాలి.
అది ఎలా? – అదే శరణా గతి,
ఇప్పుడు మనం చేసే భజనలు సాధనలు, జపములు , తపములు, అన్నీ ( కోరికలతో చేస్తే ) ఇవన్నీ ఒక డిపార్ట్మెంట్ కు మాత్రమే పరిమిత మౌతాయి.
(కోరికలు) మన ప్రవర్తన బాగుంటే, ప్రార్థన హృదయపూర్వకముగా ఉంటే – అపుడు దానికి సంబంధించిన “డిపార్ట్మెంట్ కు” తాను తెలియజేసి కర్మ యొక్క, దుష్ట ఫలితాలను రద్దు చేయిస్తాడు…
అదే దివ్యత్వము యొక్క ప్రత్యేకత.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి