ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ధ్యానము, జపము, యోగము కంటే ప్రేమ తత్వము చాలా సులభమైనటువంటిది.

భగవంతునికి – అర్పితముతోనే – ఆనందము లభిస్తుంది
వేదములు కంటే వేదాంతము చాలా అవసరమైనటువంటిది

ఎంత ఇచ్చావు బీదలకు? ఏమి ఇచ్చావు బీదలకు? ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు? అని భగవంతుడు చూడడు,

ఎన్ని మూటలు బియ్యం బీదలకు పెట్టాము? ఎన్ని చీరలు ఇతరులకు ఇచ్చాము? ఇవన్నీ కూడా ఆదాయపు పన్ను అధికారికి ఈ సూచి పంపితే వారు లెక్క చేసుకొంటారు.
కానీ భగవంతునికి పంపించవలసినది మన లోపలి భావము మాత్రమే …
ఎవరికైనా ఏదయినా కొంచం పెట్టినప్పటికినీ, భగవంతుడు అందులోని భావం చూస్తాడు….
ఈ మూటలూ, ఈ చీరలు, ఈ బ్యాగులు ఇవన్నీ చూడడు…
కనుకనే భగవంతుడు కోరేది నాణ్యత, మోతాదు కాదు, అది ఎంత చిన్నదైనా సరే…
రుక్మిణీ కేవలం దేనితో తూచింది కృష్ణుడిని? చిన్న తులసి దళంతో తూచింది, రుక్మిణి ప్రేమకు, కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు.
పిడికెడు అటుకులు ఇచ్చాడు,
దుర్వాస మహర్షి పాండవులను పరీక్షించడానికి అడవులకు వచ్చినపుడు ద్రౌపది ఏమి చేసింది? ఏమి చేయలేదు, కృష్ణా నీవే గతి అంది.
తానేక్కోడో దాచుకున్నటువంటి చిన్న రైస్ ముక్కను (బియ్యం గింజను) చేతిలో పెట్టింది….అదియే అక్షయం అక్షయం అక్షయం గా మారింది….
కనుకనే అన్ని అవతారములయందు కూడాను ఇలాంటి చిన్న చిన్న దాని తోనే అనంతమైన తత్వాన్ని పొందుతూ వచ్చారు…
కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మనము దూరము చేసికొని, అహంకారమనే దానిని నిర్మూలన చేసి, అర్పితము అనే దానిని మనము నేర్చుకోంటే అప్పుడే మనకు ఆనందము అనేటటువంటి భాగ్యము లభిస్తుంది.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి