భగవంతుడు తన కొరకై ఎట్టి పూజలు కానీ సేవలు కానీ మరే ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనలు కానీ అశించడు!
ఆయన ఈ లోకమున ఏదైనా ఆశించెనంటే అది కేవలం తన భక్తుల మోక్ష సాధన కోసమే!
మనం అనుకోవచ్చును, దైవం మాచేత ఇలా సేవలు చేయించడమెందుకు!
ఆయన సర్వ శక్తిమంతుడు కదా! ఆయనే చేసుకోవచ్చును కదా! అని.!
రాముడు లంకకు పోవ వీలుకాకనా హనుమంతునికి సేతువు కట్టమని చెప్పినది!? కాదు కాదు,
తన భక్తులను ఉద్ధరించి తరింపజేయుటకే వారికి కొన్ని బాధ్యతలు అందిస్తుంటాడు, తన భక్తుల యెుక్క శక్తి సామర్థ్యాలను లోకమునకు ఆదర్శము చేకూర్చు నిమిత్తము తన సంకల్పములో కొంత భాగం బాధ్యతగా అందించును.
ఎవరో సేవలు చేస్తుంటే చూడడం కాదు, భగవంతుడు తన సంకల్ప నిమిత్తం ప్రత్యేకముగా ఏ ఒక్కరినో ఎంచుకోలేదు! అందరూ భగవంతుని చేత ఎన్నుకోబడినవారే!
కనుక ప్రతీ ఒక్కరూ చిన్నదైనా పెద్దదైనా వారివారి శక్తి సామర్థ్యాలు బట్టి సేవలు చేస్తూ ఉండాలి.
సేవ చేయడమనేది మన ఆత్మోద్ధారణకే కనుక బాధ్యతతో, నిస్వార్థంతో సేవలలో పాల్గొంటుండాలి.
తదుపరి జరిగవలసినదంతా భగవంతుడే చూసుకుంటాడు.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి