మాయకు యజమాని భగవంతుడు, మాయ భగవంతుని వాకిట వుండే భయంగొలిపే కుక్క వంటిది.
అది ఇతరులను తన యజమాని దగ్గరకు రానీయదు. నీవు ఆ యజమానిని, ఆ భగవంతుణ్ణి చేరదలచుకుంటే రెండే మార్గములున్నాయి.
ఒకటి మనం యజమాని రూపం ధరించడం, అప్పుడది మనలను ఏమి చేయదు…దానికే సారూప్యమని పేరు…
కానీ ఆ రూపములో ఏ మాత్రము పొరపాటు కనిపించినప్పటికీ ఆ కుక్క మనలను వదిలిపెట్టదు.
రెండవ మార్గము మనము యజమానిని పెద్దగా పిలిచినప్పుడు, ఆ పిలుపు విని ఆయన వచ్చి మనలను ఆదరంతో ఇంట్లోకి వెంటబెట్టుకొని తీసికొనివెళతాడు…దానికే సామీప్యమని పేరు….
మాయ భగవంతుని పెంపుడు కుక్క కాబట్టి అది ఆయన చెప్పినట్లుగా వింటుంది, అతని జోలికి వెళ్లకు అని ఆయన చెప్తే ఇక దాని వల్ల మనకు భయం లేదు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన మధుర వాక్కులను పరిశీలిద్దాము
తాను భక్తునికి వశమయ్యే విధానాన్ని తనంత తానుగా ఎంత సరళంగా తెలియజేశారు అంటే…!
హృదయపూర్వకంగా ఆర్తితో పిలిచే ఈ రెండవ పద్దతి ఎంత సులభమైన విధానం! అదే నామ స్మరణము.
దానివల్ల భగవంతుడు ప్రేమతో కదిలివస్తాడనటం సాయి భక్త కోటి కంతటికీ అనుభవంలోవున్న విషయమే కదా…
నిరంతరం నామస్మరణ వల్ల ఆ నామియొక్క రూపం కూడా పొందవచ్చునని భగవాన్ బాబా ప్రభోదము.
నిరంతరం రామనామ స్మరణవల్ల భరతుడు రామునివలెనే కనిపించేవాడని,
కృష్ణ నామస్మరణవల్ల ఉద్దవుడు కృష్ణుని వలెనే అనిపించేవాడని, క్రీస్తు నామ స్మరణవల్ల మోజెస్ క్రీస్తువలెనే తలపించేవాడని భగవాన్ బాబా అంటారు.
అలా ఆర్తితో, భక్తితో, విశ్వాసంతో, నామస్మరణ చేసిన వారికి ఎలాంటి మాయలు అంటకుండా – భగవంతుడు వశమవ్వుతాడు.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి