మనకు రెండు కండ్లు, రెండు చేతులు , రెండు కాళ్ళు ఎలా ఉంటాయో, భగవంతుని చేరడానికి రెండు ఉంటాయి,
భక్తి – సేవ … ఈ రెండింటిలో ఏదొక్కటి లేకున్నా భగవంతుడు ని చేరుకోవడం కష్టం…
దేహమున్నది సేవించుట కొరకే! ధనమున్నది దానము చేయుట కొరకే!
కానీ నేడు పరిస్థితి తారుమారైంది…
” దేహమున్నది భుజించుట కొరకే, ధనమున్నది బోగములను అనుభవించు కొరకే !” అనేలా ఉంది ఈనాటి లోకం!
కూరలో తగినంత ఉప్పు ఉన్నపుడే రుచిగా ఉంటుంది… ఉప్పు ఎక్కువైపోయినచో రుచి చెడిపోతుంది, కూరను తినలేము కూడా…
అలానే సాధకునికి ఎంత అవసరమో అంతే పొందడానికి పాటుపడాలి, అతి ఆశతో ఉండరాదు,
అలానే ఈ దేహములో శక్తి ఉన్నంత వరకూ సేవలు చేస్తుండాలి, ( పరోపకారం చేస్తుండాలి ) ధనము అవసరము మేరకే మనము ఉపయోగించుకోవాలి…
మిగిలినది దానధర్మాలకు, సేవలకు వినియోగించుకోవడం మంచిది,..
భగవంతుడు ఇచ్చిన సకలమూ తిరిగి భగవంతునికే అర్పించాలి, ఇందులో స్వార్థం,సంకుచిత్వం పనికిరాదు…
దానధర్మాలు చేయడం వలన తామేమీ బిక్షకులు అయిపోరు!
భగవంతుని ఖజానా బాగా నిండుకుని ఉంటుంది ఎల్లవేళలా…. ఎవరు ఎంత ఎక్కువ సేవలు చేస్తే అంతకు పది రెట్లు వారి ఖజానా నుండి నింపుతుంటాడు, ఈ విశ్వాసం తో ముందుకెళ్లాలి,
పరోపకార నిమిత్తం శ్రమించే వారి బాగోగులు స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు… ఇది సత్యం, దీనిగూర్చి భయం, ఆందోళన అనవసరం,…
భగవంతుని వాక్యములు నమ్మి ఆయన చూపిన మార్గంలో నడచుకోవడమే మనం చేయవలసి పని.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి