మానవ జన్మకు – పునరపి జననం లేకుండా అనుగ్రహించడానికే భగవంతుని అవతారం,
అది – ఎలా???
పూజలు భజనలు చేయించుకోవడమే, మ్రొక్కులు తీర్చడమో, కోరికలు నెరవేర్చడానికి కాదు, తాను తన మహిమలతో, నామ స్మరణ రుచితో, మనలని దగ్గరకు తీసుకొని, తాను ఏంటో తెలియ చెప్పి, తనలో , తనతో మమేకం చేసుకోవడానికే, నేను నీవు ఒక్కటే ! ఆత్మ – పరమాత్మ రెండూ ఒక్కటే అని నిరూపించి మనలను భగవంతునిగా మార్చడానికే తాను అవతరించింది ….
మరి తనను చేరడానికి – మనమేమి చేయాలి???
ధనము పోయిన మరి ఏట్లో సేకరించవచ్చును, అయితే, కాలాన్ని సంపాదించడం అసాధ్యం.
కాబట్టి, కాలాన్ని కర్మతో పవిత్రం చెయ్యడం లో నిమగ్నమవ్వాలి, బహిరంగంలో కర్మము, అంతరంగంలో ధ్యానము ౼ ఇవి జ్ఞానసంపాదనకు మిక్కిలి ఉపయోగకరమైన సాధనలు.
గడచిన నిమిషం మనది కాదు, వచ్చే నిమిషం కూడా మనది కాదు.
ఉన్న నిమిషమే సత్యమని భావించి ఎప్పటికప్పుడు పరమాత్మను చేరుటకు సంసిద్ధులము కావాలి…!
క్షుద్రమైన ఫలితములకై ప్రార్థించక, అక్షరమైన అనుగ్రహమునకై ఆరాటపడాలి, చీమ అయినా అడుగులు వేస్తూపోతే గురిని చేరుతుంది.
గరుత్మంతుడైనా తన రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గురిని చేరలేడు. కాబట్టి, అడుగు వేయడం మంచిది,
ఈనాడే ఇపుడే నిజమైన ఆవేదనతో, వివేక విచక్షణలతో సాధన మొదలుపెట్టడం మంచిది, అపుడే మనపైన భగవంతుని అనుగ్రహం ప్రసరిస్తుంది,
త్రోవ చూపుతుంది, ప్రయాణం సులభమవుతుంది… అప్పుడు మాత్రమే ఆయనను చేరవచ్చు,
మరి ఇలా చేయకుండా – సంపాదన సంసారం లో మునిగి ఇదే శాశ్వతం, ఇంతకన్నా వెరైనటువంటిది లేదు… అని భావించి నా సంపాదన లో కొంత దేవుడి హుండీలో వేస్తే పుణ్యమొస్తుంది అని అనుకొంటే – పునరపి జననం – పునరపి మరణం.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి