ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

పుణ్యక్షేత్రాల సందర్శన వలన – లాభం కలుగుతుందని భావించవచ్చా ?

ఈరోజుల్లో ప్రతిఒక్కరు మనఃశాంతి కొరుకో లేక ఏదో సాధన కొరకో , భగవత్ సన్నిధిలో గడిపి మోక్షం పొందాలనే భావంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు…
ఇంకొందరు పుణ్యనదుల స్నానాలు ఆచరిస్తుంటారు…
మరి అది ఎంతవరకు మనకు పనికి వస్తుంది???
ఈరోజుల్లో చాలామందిని చూస్తుంటాము, భగవంతుని దర్శనము కోసం వేళరూపాయల టికెట్లు కొని, భగ్వద్ దర్శనం చెలుకొనే వారిని, మరి ఇది ఎంతవరకు సమంజసం, భగవంతుని కోసం వెళ్లి, క్యూ లైన్లో నిలబడే ఓపిక లేనప్పుడు, భగవంతుడు ఎలా చిక్కుతాడు,
పూర్వం మునులు, ఋషులు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఒక నిమిషం దర్శనం కలుగలేదు…
మరి ఆయన ఇచ్చిన సంపాదనతో ఆయనను కొనగలమా … ఒకసారి మనమే ఆలోచించుకోవాలి…
మన ప్రవృత్తులను వదిలించుకోకుండా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ప్రయోజనం శూన్యం…

తిరుపతి వెళ్ళినా సినిమా పిచ్చి వదలదు, షాపింగ్ పిచ్చి ఒదలదు, ఆ లోపం మన బలహీనతదేకానీ తిరుపతి క్షేత్ర దివ్యత్వానిది కాదు కదా…
మన వంకలన్నీ ‘ఆడలేక మద్దెలోడు’ అన్నట్లుగా ఉంటాయి…
సాధన కోసం దైవంపై ఇష్టం పెంచుకోవడానికి బదులు వంకలు వెదుకుతుంటాం.
మనసు బాగు చేసుకుందామని క్షేత్రానికి వెళ్తాం, ఆ క్షేత్రాన్ని విమర్శించి మనసును మరింత పాడుచేసుకొని తిరిగి వస్తాం… ఏమి లాభం…
వికారాలకు అతీతమైనది మనసు, కానీ పరిసరాలకు, పరిస్థితులకు అది లొంగిపోతుంది.
ఆ మనసుకు తిరిగి స్థిరత్వం రావాలంటే అనవసర ఆరాటాలు తగ్గాలి, ఆత్మవిచారణతో ముందుకు సాగాలి !
అప్పుడే మన యాత్రలకు ఫలితం.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి