ఆరోగ్యమునకు కేవలం ఔషధములే ప్రధానము కాదు, మంచి మాటలు, మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి అవసరము…
ఇవే దేహానికి అమృతత్వము నందించే టానీకులు…
దుర్భావములూ, దుశ్చింతలూ హృదయములో నింపుకొని ఎన్ని విలువైన ఔషధములు సేవించినప్పటికీ రోగ నివారణ కాదు.
ఏ డాక్టర్లు చిక్కకపోయినప్పటికీ సద్గుణములను అనుభవించి, సదాచారములను ఆచరించి, సచ్చింతనలను సంకల్పించుకుంటే అవి మనకు సరైన ఆరోగ్యాన్ని అందివ్వడమేగాక ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి,ఆత్మసందర్శనాన్నికూడా కలిగిస్తాయి….
నేడు మనము అనేక విధములైన రోగములతో వివిధ క్లేశములు అనుభవించుటకు కారణం మనస్సుకు సరైన పోషణ లేకనే.
శరీరమునకు వివిధ రకములైన రుచికరమైన ఆహారమును అందిస్తున్నాము కానీ మనస్సుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందివ్వడం లేదు… అది లేకనే రోగములన్నీ వచ్చి మీద పడుతున్నాయి.
మరి – ఏమి చేయాలి???
నిత్యం ఓంకారం ,భగవన్నామమును స్మరించుట, దీనుల సేవలలో పాల్గొనుట మున్నగు ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా చేస్తుంటే ఏ రోగము మన దరికి చేరదు.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి