మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,
నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు…
మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు???, పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా???,
ఒకసారి రామావతార సంఘటన చూద్దాం
శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. …
‘మనువు’ ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం.
ఆ సాంప్రదాయ మును ననుసరించి, వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు…
అనేకమంది రాజులు, రారాజు లు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో,
” సత్యధర్మాభియుక్తానాం నాస్తిమృత్యుభయం” అని వ్రాయబడిన బోర్డు కనిపించింది.
అనగా …. సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము….
ఎందుకంటే – సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. జన్మించారు అంటేనే కదా, మరణముండేది!
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి