భగవంతుడు హృదయ వాసి, ఈశ్వర సర్వభూతానాం, అందర్నీ ప్రేమించమని చెపుతారు, ఎందుకు ప్రేమించాలి?
ఎందుకు ప్రేమించాలి అని మనం అనుకుంటాము, ఎందుకు ద్వేషించాలి మరి???
ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణము,
ద్వేషం,ప్రేమలు రెండు కూడాను బింబ ప్రతిబింబములే. కనుక ఎక్కడ ద్వేషముందో అక్కడ ప్రేమ కూడా ఉంది…
ఎక్కడ లేదనే భావముందో అక్కడ ఉంది, అనేటటువంటి సత్యము కూడా ఉంటుంది…
ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ:
ఇక్కడ ఒక గుడి ఉంది, అందులో దేవుడు ఉన్నాడా? లేడా? “ ఉన్నాడు ”… అనుకొంటే దేనిని బట్టి ఉన్నాడని చెపుతాము???
రూపాన్ని బట్టి మీరు చెప్తున్నాము కదా….
మంగళహారతులు అయిపోయాక, గుడి మూసివేస్తారు, తలుపులు వేసి వెళ్ళిపోతారు, అప్పుడు గుడిలో దేవుడు ఉన్నాడా !! లేడా!!! “లేరు”.
అనగా ఏమిటి? ఉన్నటువంటి వస్తువునే లేనట్లుగా చెప్తున్నామని అర్థం…
అసలు దేవుడు అనేవాడే లేకపోతే ….ఉన్నాడు, లేడు, అనే ప్రశ్న రాదక్కడ…
అదేవిధముగా దేవుడు ఉండబట్టే లేడు,ఉన్నాడు అనేటటువంటి రెండు పదములు వస్తున్నాయి.
దేవుడు ఉండినప్పుడే, లేడు అనే పదము పుట్టుచున్నది కానీ, దేవుడే లేకపోతే లేడు అనే పదము ఉండదు.
కనుకనే ఎవరైనా – There is god అంటున్నారు, అనగా ఏమి?
మొట్టమొదట సత్యము ప్రారంభమవుతుంది…
There is…. అని వస్తుంది, అక్కడ ఉన్నాడు…
ఎవరు? అనేది రెండవ question…
There is అది మొదటి question. ఉన్నాడు. ఎవరు? god. అయితే దీని తరువాతనే There is….. no god అంటాము…
There is ఫస్ట్ వస్తుంది, నో God next వస్తుంది…
కాబట్టే సత్యమే మొట్టమొదటగా ప్రారంభమవుతుంది,
దీనినే ఇంకొక పర్యాయము ఈ యొక్క నాస్తికత్వము ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరి పోయినప్పుడు.
మరియొక పదము కూడా ప్రారంభం అవుతుంది…
అదే god is no where అని.
God… is …no… where…. అనే నాలుగు పదములు ఉంటున్నాయి.
God is…….. no where …..( ఎన్ ఓ ) “no” డబ్ల్యూ హెచ్ ఇ ఆర్ ఇ “where” ఈ no కు w చేరిస్తే అప్పుడు God is now here అవుతుంది…
కనుక మనము words building ఆడుతున్నాము …
ఇక్కడ ఉన్న w అక్కడ చేర్చినాము, no కు w చేర్చగా అప్పుడు now అయింది.
ఈ now అనేటటువంటి పదము నుండి w ను వేరుచేసినప్పటికే అది No where అయింది.
No where కు now here కు ఓన్లీ w మాత్రమే మారుస్తుండాలి.
కనుకనే మన యొక్క భావములు నమ్మకము ఉండినప్పుడు now here అంటాము.
నమ్మకము లేనప్పుడు No where అంటాము, ఈ రెండింటికిని మన నమ్మకమే మూలకారణము.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి