ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

నిత్యము మనము – ఆ పరమేశ్వరుని ఏమని ప్రార్థించాలి?

తండ్రి ఈశ్వర ! నా శరీరంలో ఆత్మ అనే పక్షి ఎగురుతున్నంత వరకు నా యోగ క్షేమాలు అడిగేదరు అందరూ…
నాపై అతి ప్రేమ మమకారం కురిపించేదరు,
అదంతా నా హృదయంలో ఉన్న ప్రాణం ఉన్నంతవరకే,
ఒక్కసారి ఉచ్చ్వాస నిస్స్వాస అగి పోయిన తర్వాత విగత జీవుడిగా ఉంటే కట్టుకున్న భార్య, పెంచి పోషించిన పిల్లలు కూడా దరి చేరరు… కనీసం శరీరం తాకను గూడ తాకరు …
శరీరం చాలించిన కొద్ది క్షణాల వరకే శోకము ప్రదర్శించేదరు,
పరమేశ్వర ! అందమైనది అని ఉహించుకునే ఈ శరీరం రోగముతో రోతతో భూయిష్టమగును.
శరీరంలో ప్రాణ వాయువు ఉన్నంత వరకే, అగిపోగానే పనికిమాలినది అయిపోవును కదా!!!,
పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం తిరిగి మళ్లీ పంచభూతాలతోనే కలిసి పోవును, బంధు ప్రీతిని తగ్గించి, నీపై ప్రీతిని పెంచు, … ఏది శాశ్వతమో అది ప్రసాదించి నీ కడకు చేర్చుకో…
హీనమైన శరీర బాంధవ్యాల కోసం మమతను తొలగించి, వస్తువులపై వ్యామోహం వదులుకొని నా మనస్సు పూర్తిగా మహదేవ నీ యందే లగ్నం చేయు …
నిత్యం నీ స్మరణ, నీ ధ్యానం తప్ప ఇతరములు, నా దరి చేరనివ్వకు … ఓ దేవ దేవా … నాకు మంచి సద్బుద్ధి ప్రసాదించి, మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు, నా లోపలి అరిశడ్ వర్గాలు అరికట్టి నీ దరికి చేర్చుకో…
నీ సన్నిధిని మించిన ఆనందం సుఖం మరొకటి లేదని నాకు నిత్యము తెలియచేయు … ఈ చేయిపట్టి నడిపింపు ఈశ్వరా , సర్వేశ్వరా, జగదీశ్వర…🙏🙏🙏

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి