చిన్న ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాము …
ఒక ఇంటిలో ముగ్గురు సోదరులుంటారు, ఈ ముగ్గురు కూడాను ఒకరినొకరు అనుసరించి ప్రేమించి ఒకరినొకరు అన్యోన్యముగా కలసి ఉండినప్పుడే ఈ ఇంటిలో ఒక విధమైనటువంటి శాంతి ఏర్పడుతుంది…
కానీ ఏ కారణము చేతనైననూ ఈ ముగ్గురికి మనసు నందు అభిప్రాయభేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నముగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడాను ప్రాకిపోతుంది…
ఐకమత్యమే ఈ ఆనందమునకు, శాంతికి మూలకారణము, ఐకమత్యము చెదిరినప్పుడే అశాంతికి, అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణమేర్పడుతుంది…
ఇక్కడ ఇల్లు ఏమిటి? ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
దేహో దేవాలయ ప్రోక్షో జీవో దేవాఃస్సనాతహ అన్నారు…
దేహమనేటటువంటిదే ఒక ఇల్లు, దేహము దేవాలయము. Or residence … కనుక ఈ గృహమనేటటువంటి ఇంటి యందు దేహము నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు….
Thoughts, Words and Action అనగా సంకల్పములు, వాక్కు, క్రియా శక్తి వీటి మూడు పేర్లు…
ఈ ముగ్గురు కూడాను అన్యోన్యముగా ఐకమత్యముగా ఆనందముగా కలసి మెలిసి ఉండినప్పుడే ఏ కార్యములో నైననూ విజయము సాధించవచ్చు.
కానీ thoughts ఒకవైపున, పలుకులు మరొకవైపున పని ఇంకొక వైపున పోయినపుడు ఒకదానికొకటి ఐకమత్యము చెదిరి నప్పుడు ఏ కార్యమును కూడాను మనము సాధించలేము.
కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణశుద్ధి అన్నారు…
కనుకనే మన గృహము నందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములను మనము అభివృద్ధి పరుచుకోవాలి.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి