దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టంఒకటి తలిస్తే దైవం ఇంకోకటి తలుస్తుంది అని తలుపు తడుతుంది!!! అది ఎలా ఒకసారి పరిశీలిద్దాం!!!
అదృష్ట వంతున్ని ఎవరు చెడగొట్టలేరు, మానవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్ట వంతున్ని ఎవరు బాగు చేయలేరు…
ఒక రాజుగారి కొలువులో ఇద్దరు పురోహితులున్నారు, అందులో ఒకరి పేరు దైవాధీనం. ‘’దైవాదీనం జగత్సర్వం ‘’ అని నమ్మినవాడు.
జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనక ఆపేరు వచ్చింది ఆయనకు…
రెండో అతని పేరు రాజాధీనం, రాజుగారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మే వాడు,
కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది, రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందుకునేవాడు, ఇతని దగ్గర దేనికి కొదువ లేదు,
ఒక రోజు రాజుగారికి రాజాదీనం గారిని సువర్ణ, వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది… అదీ ఎవరికీ తెలీకుండా రహస్యంగా చేయాలని భావించాడు…
ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనంగారికి సదక్షిణంగా దానం చేశాడు…
ఆయన దాన్ని ఇంటికి మోసుకుపోతూ ఆలోచించాడు. ” దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది” అని…
ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్లాడు…
శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది, “గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు, కదా ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను” అనుకొన్నాడు…
అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు, శట్టి గారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండదానం (గుమ్మడికాయ దానం) చేశారు…
దైవాధీనం గారి భార్య, భర్త తెచ్చిన గుమ్మడికాయను చూసి చాలా సంతోషపడి, ఇది వండి నలుగురికి పెడదాం అనే ఆలోచనతో పగుల గొట్టించింది భర్తచేత…
అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కనిపించాయి…
ఇదంతా దైవలీలగా ఆయన భావించి, దాని తో తన దరిద్రమంతా తీరిపోతుందని సంతోషించి ఆ పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు,
మర్నాడు రాజాదీనం రాజదర్శనానికి వెళ్లాడు. “గుమ్మడికాయ కూర తిన్నారా…” అని రాజు అడిగాడు,
ఆహా, ఓహో అద్భుతం అని బొంకారు రాజాధీనంగారు, రాజుగారికి అర్ధమైంది, గుమ్మడికాయ ఆయన ఇంటికిచేరలేదని, ఒల్లుమండింది, భటులను పిలిపించి కొరడాతో ఝాలిపించి నిజం కక్కించాడు…
శెట్టిని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశాననని చెప్పాడు.
తాను ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాడేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు…
మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి … భటుడిని కనిపించకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు,
రాజదీనం నడచివస్తు, దాన్ని గమనించకుండా వెళ్లిపోయారు…
భటుడు రాజుగారికి విషయం తెలిపాడు, ఆయన మళ్ళీ ఆశ్చరయంలో మునిగాడు,
రాజు గారు రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు, దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు…
రాజుకి అర్థమైంది… తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోకటి తలుస్తుంది అని.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి