ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ఈ సంసార సాగరంలో – నామస్మరణ అనే పడవలో – మన ప్రయాణం ఎలా సాగించాలి?

ఈరోజుల్లో మనకున్న కొద్దిపాటి సమయంలో – అందరి మాట ఒక్కటే భగవంతుని కోసం సమయం కేటాయించడానికి మేము సంసార విషయాలలో తీరిక లేకుండా ఉన్నాము అని, ఎంత ప్రయత్నించినా సమయం కుదరడం లేదు అంటుంటారు చాలా మంది…
ఇది కేవలము మనలోపలి బద్దకం అనే అనుకోవాలి, గంగా నదిలో స్నానం చేసేటపుడు నదీ వేగము ఎక్కువగా ఉంటుంది…
ఏమరుపాటుగా ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు, అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదీస్తారు…
మనం ఆ గొలుసును పట్టుకొని ఎంతసేపైనా నదిలో స్నానం చేయవచ్చు, ఏమీ కాదు…

అలాగే మనం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా – అంటే ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వృత్తి, విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనసును, అంత:కరణమును మాత్రం పరమాత్మ అనే గొలుసుతో లగ్నం చేసి …( అంటే పట్టుకొని ఉండాలి ) అప్పుడు ఈ సంసారంలో మనం ఇష్టం వచ్చినట్టు విహరించవచ్చు …
కానీ పరమాత్మ అనే గొలుసు మాత్రం వదలకూడదు, ఒకవేళ వదిలితిమా ఈ సంసారము అనే నది ప్రవాహంలో పడి కొట్టుకుపోక తప్పదు…
అపుడు మనలను ఉద్ధరించే నాథుడే లేడు, భగవంతుడు కూడా ఏమి చేయలేడు…
ఈ సంసార సాగరంలో – భవసాగరం దాటాలంటే – మన ప్రయాణం కేవలం నిత్య నామస్మరణతో మాత్రమే సాధ్యం.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి