ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

నిధి సుఖమా? – దేవుని సన్నిధి సుఖమా?

మనం అనేక కర్మలు చేస్తుంటాము, వాటికి తగిన ఫలితములు వస్తుంటాయి.
కొన్నింటి వలన సుఖము, ఆనందము కలుగుతూ ఉంటుంది…
కాని ఆ సుఖములు, ఆనందం కేవలం పరిమితమే తప్ప అపరిమితం కాదు…
పెళ్లి చేసుకోవడం, మంచి ఉద్యోగం, పిల్లలు, ధన సంపాదన, ఆస్తి కూడబెట్టడం ఇవన్నీ పరిమితమైన సుఖాలను ఇస్తాయి…
ఇవే కొంత మందికి దు:ఖాలను కూడా కలుగజేస్తాయి…
ఇవన్నీ ఈ రోజు ఉండి రేపు పొయ్యేవే, ఏవి శాశ్వతం కావు, ధనం వస్తే సుఖం … పోతే దు:ఖం…
ఈ సుఖాలన్నిటికీ అతీతమైనది ఏమిటి, అనేది తెలుసుకోవాలి!!!
ఆత్మానందము అనుభవించే వాడికి దు:ఖానికి తావు అనేదే లేదు… కేవలం సుఖమే ఉంటుంది,
అటువంటి సుఖం ముందు ఈ చిన్ని చిన్ని సుఖాలు గంగానది పక్కన ఉన్న వాడికి చిన్న జలాశయం ఉన్నట్టు ఉంటుంది…

కోట్లు మూలుగుతున్న వాడికి పదిరూపాయలు వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా?
అలానే భగవంతుని అనుగ్రహం వలన కలిగే ఆత్మానందం ముందు ఈ ప్రపంచిక విషయాల వలన కలిగే సుఖాలు ఎందుకూ పనికిరావు…
అటువంటి ఆత్మానందం కొరకు మనం ప్రయత్నం చేస్తుండాలి,
మరి అది ఎప్పుడూ సాధ్యపడుతుంది???
కేవలం భగవత్ సన్నిధిలో వున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది,
ఆయన చెంతనుండి కూడా, ఆయనను ఏ తుచ్ఛమైన కోరికలు కొరనప్పుడు మాత్రమే సాధ్యం.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి