మానవుడు ఎట్టి సాధన చేసినప్పటికీ, ఎట్టి దాన ధర్మాలు, యాగాలు నిర్వహించినప్పటికి కర్మ ఫలితమును కొంత మేరకు తప్ప పూర్తిగా తప్పించుకోలేడు అనేది సత్యం…
దైవానుగ్రహం చేత కొంత ఫలితం నుండి విముక్తి పొందవచ్చును…
అయితే మనం చాలా వరకు కర్మ ఫలితమును పూర్తిగా తగ్గించమని భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటాం,
కానీ ఇది మోక్ష సాధకులకు తగని పని, ఇది పనికి రాదు,
మరి ఏమి కోరుకోవాలి???
కర్మ ఫలితమును తొలగించమని భగవంతుని కోరే కంటే కర్మ ఫలితమును కరిగించమని కోరుకోవడం సాధకునికి చాలా ఉత్తమం…
ఎందుకంటే ఎన్నో జన్మల కర్మల ఫలితమే ఈ జన్మ , ఒక జన్మలో కర్మల ఫలితం పూర్తిగా ఆ జన్మ లో అనుభవించకపోతే వాటిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తాలి…. అది తప్పదు , మళ్ళీ ఆ జన్మలో కర్మలు చేస్తాం… అవి పూర్తికాకపోతే మళ్ళీ జన్మ…. ఇలా తిరుగుతూనే ఉండాలి.! పునరపి జననం – పునరపి మరణం,
కానీ కర్మల ఫలితం పూర్తిగా కరిగితే తప్ప పరమపదం చేరుకోలేము,
అందుకే కర్మలను పూర్తిగా కరిగించమని దేవుని వేడుకోవాలి…
దైవము ఇష్టం వచ్చిన రీతిగానే మనం నడుచుకోవాలి, రాక రాక వచ్చిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకుని, కష్టమో నష్టమో ఈ జన్మలోనే జనన మరణ చక్రమునకు ముగింపు పలుకడం ఉత్తమం,
కర్మలను త్వరగా పూర్తిగా కరిగించమని దైవమును వేడుకోవడమే , మోక్ష ప్రాప్తికి మార్గమును సిద్ధం చేసుకొన్నట్లు…
అందుకే కష్టనష్టాలు సమానంగా భావించి, దుర్జనులకు దూరంగా నివసించి, భగవంతుడుని నిత్యం ధ్యానించి, మోక్షమార్గమును వేతకడమే సాధన.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి