నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి, అయితే నీకు ఉద్యోగము వచ్చింది, ఇతరులకు రాలేదు… ఎందుకు??,
నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో, అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ వారికి జవాబు రాలేదు… ఎందుకు??,
నీవు నిర్వహిస్తున్న వ్యాపారమే ఇతరులు , నిర్వహిస్తున్నారు, నీవు లక్షలు గడిస్తున్నావు, కానీ వారు ఏమిలేక భాద పడుతున్నారు… ఎందుకు??,
ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో, అదే దారిలో అనేకులు మరణించారు… ఎందుకు??,
ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను దీవించాడో, అక్కడే అనేకులు ఇంకా దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే వున్నారు ఇంకా దీవెన రాలేదు, వారి ప్రార్థనలు వినలేదు … ఎందుకు??,
ఆసుపత్రిలో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి ఇంటికెళ్ళావో , అదే పడకపై ఉండి అనేకులు మరణించారు… ఎందుకు??,
ఏ వర్షమైతే నీ పొలానికి మంచి పంటలనిచ్చిందో అదే వర్షం, ఇతరుల పొలాలను నాశనం చేసింది… ఎందుకు??,
నీకు భగవంతుడు ఇవన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి,
ఎందుకంటే నీవేదైతే కలిగి ఉన్నావో అది నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ అర్హతలు కాదు.
కేవలం ఇదంతా భగవంతుని కృప, అంతే కానీ మన శక్తి, తెలివితేటలు భగవంతుని ముందు ఏమి పనిచేయవు, అని గుర్తుంచుకోవాలి, మనకు కలిగిన ప్రతిదీ ఇచ్చేవాడు ఆయనే మాత్రమే…
కనుక ప్రతీ విషయంలో ఆదేవదేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి.
🙏సమస్త లోకా సుఖినోభవన్తు!🙏
వ్యాఖ్యానించండి